India Pak War: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అందుకు ప్రతిఘటనగా పాకిస్థాన్ దాడులను చేస్తుంది. పాకిస్థాన్ దాడులను సమర్ధంగా ఎదుర్కొంటోంది. భారత్ చేసిన ధాడికి పాకిస్థాన్ సైనిక స్థావరం నేలకూలింది. అయితే ఎక్కడ అనేది మాత్రం తెలిసిరాలేదు. ఈ దాడిలో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. చండీగఢ్‌లో ఎయిర్ సైరన్ మోగింది. దాడులు జరగొచ్చని ఎయిర్‌ఫోర్స్ హెచ్చరించింది. స్థానికులు ఇళ్లనుంచి బయటకి రావొద్దని అధికారులు సూచించారు.
ఇప్పటివరకు పాకిస్థాన్ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. 50పాక్ డ్రోన్ లను మట్టికరిపించింది. పాకిస్థాన్ కు చెందిన మూడు ఫైటర్ జెట్లను, రెండు సహాయక విమానాలను నేల కూల్చింది. ఒక పైలట్ భారత్ కు పట్టుబడ్డాడు. ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా (జమ్మూ కాశ్మీర్‌లోని అన్నీ) మరియు పఠాన్‌కోట్ (పంజాబ్) ప్రాంతాలలోడ్రోన్ లనుప్రయోగించింది పాకిస్థాన్.
ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీకానున్నారు. యుద్ధ పరిస్థితులపై మోదీ, అజిత్ దోవల్ చర్చించనున్నారు. మరోవైపు CDS, త్రివిధ దళాల అధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ కొనసాగుతోంది. పాక్ దాడులు, భారత ప్రతిచర్యలపై రక్షణ, విదేశాంగశాఖ మీడియా సమావేశాలు నిర్వహించనుంది. కాసేపట్లో కేంద్ర విదేశాంగ మంత్రి కీలక ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.