Notification: నిరుద్యోగులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వేలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ స్నిగల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నీషియన్, ఫీల్డ్ ఇంజనీర్, సైట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (ఆర్ఐటీఈఎస్) బోర్డు నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 19 లోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.
నోటిఫికేషన్ లో టెక్నీషియన్ 2, ఫీల్డ్ ఇంజనీర్ 6, సైట్ ఆఫీసర్ 6 తో మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నీషియన్ పోస్టుకు ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో బీఎస్సీ, ఫీల్డ్ ఇంజనీర్, సైట్ ఆఫీసర్ పోస్టులకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రీషియన్ మెకానిక్స్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్స్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ఎలక్ట్రీషియన్ విభాగంలో ఐటీఐ చేసిసవారు అర్హులు.
కాగా దరఖాస్తులు సమర్పించేందుకు ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇతరులకు రూ. 300 గా నిర్ణయించారు. జాబ్స్ కోసం అప్లై చేసుకునేందుకు మే 19 లాస్ట్ డేట్ అని తెలిపారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. వివిధ వర్గాలకు వయస్సులో సడలింపు కల్పించారు.
రాత పరీక్ష ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మొత్తం 125 ప్రశ్నలతో 2.30 గంటలపాటు పరీక్ష రాయాల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్థులకు మరో 50 నిమిషాల సమయాన్ని అదనంగా కేటాయిస్తారు. పరీక్షకు నెగెటివ్ మార్కులు లేవు. ఓపెన్, ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధిస్తే.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు ఎంపిక చేస్తారు. వివరాలకు WWW.RITES.COM లో సంప్రదించగలరు.